: కోల్ కతాలో సింగపూర్ వాయుసేన విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
నేపాల్ నుంచి సింగపూర్ వెళుతున్న సింగపూర్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం భారత్ లో అత్యవసరంగా దిగింది. భారత్ లో ప్రవేశించేసరికి విమానంలో మరో ఆరు నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే మిగిలింది. ఇంధన లీకేజి కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో, విమానాన్ని కోల్ కతాలోని సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ రవాణా విమానంలో 15 మంది ఉన్నారు. కాగా, లోపాన్ని సరిదిద్దిన అనంతరం, ఈ విమానం సాయంత్రం సింగపూర్ పయనమైంది.