: పొంగులేటి ఒకరోజు రైతుదీక్ష
తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకరోజు రైతు నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భరోసా కల్పించేందుకే ఈ దీక్ష చేస్తున్నట్టు పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఈ దీక్ష జరగనుంది. తెలంగాణలో 10 నెలల కాలంలో 800కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైసీపీ నేతలు చెప్పారు. ఆత్మహత్యలు అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, వారికి కనువిప్పు కలిగించేందుకే ఈ దీక్ష అని పేర్కొన్నారు.