: కేజీ టు పీజీ ఈ ఏడాది సాధ్యం కాకపోవచ్చు: కడియం శ్రీహరి


టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత విద్యా పథకం ఈ ఏడాది సాధ్యం కాకపోవచ్చని టీఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతేకాకుండా, ఈ కార్యక్రమంపై అందరి అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నామని కడియం తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా ప్రమాణాలను పెంచడం సవాల్ తో కూడుకున్న అంశమని చెప్పిన ఉప ముఖ్యమంత్రి... ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News