: 80 ఏళ్ల సాహచర్యం... చావులోనూ వీడలేదు


నిండు నూరేళ్ల జీవితంలో 80 ఏళ్లు వారిద్దరూ భార్యాభర్తలుగా అన్యోన్యంగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోనొ లక్ష్మీపూర్ ఖేరీ గ్రామానికి చెందిన రాధిక (103) , ఫకీరా (107)లు శతాధిక వృద్ధులు. అప్పట్లో ఇద్దరికీ బాల్యవివాహాలు జరిగాయి. ఇన్నేళ్లుగా ప్రేమానురాగాలతో జీవనం సాగిస్తున్న తరుణంలో రాధికకు గుండెపోటు వచ్చింది. దీని కారణంగా ఆమె మృతి చెందింది. దీనిని తట్టుకోలేకపోయిన ఫకీరా కూడా తుదిశ్వాస విడిచాడు. దీంతో గ్రామం మొత్తం కదిలింది. గ్రామానికి పెద్దదిక్కులా, ఆది దంపతుల్లా కలిసి ఉన్న వారిద్దరి అంతిమ సంస్కారాలు, కుల మతాలకతీతంగా గ్రామస్థులంతా ఏకమై వేడుకలా నిర్వహించారు.

  • Loading...

More Telugu News