: తొలిదశ విచారణలో 14 లక్షల ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని తేలింది: ఏపీ మంత్రి మృణాళిని
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇళ్ల నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో, తొలిదశ విచారణలో మొత్తం 41 లక్షల 609 ఇళ్లకు గాను... 14 లక్షల ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని తేలింది. ఈ వివరాలను, ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని వెల్లడించారు. అనంతపురం జిల్లాలో అక్రమాలు అధికంగా జరిగాయని చెప్పారు. మొత్తం నిర్మాణాలపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై రెవెన్యూ రికవరీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మృణాళిని చెప్పారు. దీనికితోడు, కొత్తగా 2 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు.