: నాతో కలిసి నడవడం నాన్నకు ఇబ్బంది: శ్రుతి హాసన్
ఫంక్షన్లప్పుడు తనతో కలిసి నడవడం తన తండ్రికి పెద్దగా ఇష్టం ఉండదని ప్రముఖ హీరో కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ తెలిపింది. బాలీవుడ్ సినిమా 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఏదైనా కుటుంబ ఫంక్షన్ కు కలిసి వెళ్ళినప్పుడు దూరంగా నడవాలని తన తండ్రి చెబుతారని చెప్పింది. ఎందుకంటే, తాను హైహీల్స్ వేసుకోవడం వల్ల తన తండ్రి కంటే బాగా ఎత్తుగా కనిపిస్తానని, దీంతో నాన్న అసౌకర్యంగా ఫీలవుతారని శ్రుతి చెప్పింది. కమలహాసన్ 1.65 మీటర్ల ఎత్తు కాగా, శ్రుతి హాసన్ ఎత్తు 1.73 మీటర్లు.