: రూ. 2 వేల కోట్లు అవసరమైతే, చంద్రబాబు రూ. 200 కోట్లు మాత్రమే కేటాయించారు: వైకాపా
కేవలం హంద్రీనీవా ప్రాజెక్టుతో మాత్రమే అనంతపురం జిల్లా నీటి కష్టాలు తీరుతాయని ఉరవకొండ వైకాపా ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. హంద్రానీవా ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ. 2 వేల కోట్లు అవసరమని... కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం రూ. 200 కోట్లు మాత్రమే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుతూ తన నియోజకవర్గంలోని బెళుగుప్పలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తం రాయలసీమ పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.