: ఫాంట్ రూపంలో అందుబాటులోకి వచ్చిన ఐన్ స్టీన్ చేతిరాత


ఆల్బర్ట్ ఐన్ స్టీన్... ప్రపంచపు అగ్రశ్రేణి మేధావుల్లో ఒకరు. మీకు ఆయనలాంటి మేధస్సు ఉండకపోవచ్చు. కానీ, ఆయన చేతిరాతలా మీరు రాయచ్చు. ఐన్ స్టీన్ చేతి రాతను ఫాంట్ రూపంలోకి మార్చగలిగాడో జర్మన్ ఆర్టిస్ట్. టైపోగ్రఫీలో నైపుణ్యమున్న హెరాల్డ్ గిస్లర్, లిజ్ వాటర్ హౌస్ అనే వ్యక్తులు ఈ ఫాంట్ ను రూపొందించారు. ఇది అత్యధిక డిజిటల్ డివైజ్ లకు అనుగుణంగా ఉంటుందని, అన్ని రకాల కంప్యూటర్, మొబైల్ ఫోన్లలో పనిచేస్తుందని వారు వివరించారు. ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని (థీరీ ఆఫ్ రిలేటివిటీ) ప్రతిపాదించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ఫాంట్ విడుదల కావడం గమనార్హం. తన గురుత్వాకర్షణ సిద్ధాంతం, అంతరిక్షం, కాలం మధ్య బంధాన్ని తెలుపుతూ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్షతలు నిన్నటి తరం శాస్త్రవేత్తలకు భవిష్యత్ మార్గనిర్దేశకత్వాన్ని చూపాయి.

  • Loading...

More Telugu News