: దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడో తెలియదు: కేంద్రం
అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడో తెలియదని కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకు, దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో గానీ, ఆప్ఘనిస్తాన్ లో గానీ ఉండొచ్చని చెబుతూ వచ్చిన కేంద్రం, తాజాగా, అతని ఆచూకీ తెలియదని పార్లమెంటుకు తెలిపింది. బీజేపీ ఎంపీ నిత్యానంద్ రాయ్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హరిభాయ్ చౌదరి జవాబిచ్చారు. అతనెక్కడున్నాడన్నది కచ్చితంగా గుర్తించలేదని, ఒక్కసారి ఆచూకీ తెలుసుకున్నాక, అతడిని భారత్ రప్పించేందుకు చర్యలు మొదలుపెడతామని వివరించారు.