: మధ్యప్రదేశ్ లో బాబా రాందేవ్ 'పుత్రజీవక్' ఔషధంపై నిషేధం


ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కు చెందిన దివ్య ఆయుర్వేద ఫార్మసీ ఉత్పాదన 'పుత్రజీవక్ బీజ్' ఔషధాన్ని మధ్యప్రదేశ్ సర్కారు నిషేధించింది. ఆ ఔషధం పేరు మార్చేంతవరకు అమ్మకాలు జరపరాదని స్పష్టం చేసింది. ఈ ఔషధం వాడితే మగబిడ్డ ఖాయమని ప్రచారం చేస్తున్నారంటూ దివ్య ఫార్మసీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బాబా రాందేవ్ వివరణ ఇచ్చారు కూడా. అబ్బాయే పుడతాడని తామెక్కడా హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయినా, విపక్షాలు ఆ ఔషధాన్ని నిషేధించాల్సిందేనని, తయారీదారులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నాయి.

  • Loading...

More Telugu News