: పారిపోయిన ఆప్ ఎమ్మెల్యే: ఢిల్లీ పోలీసులు
ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడు జర్నైల్ సింగ్ తప్పించుకుని పారిపోయాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఓ గవర్నమెంట్ ఇంజనీర్ ను కొట్టిన ఘటనలో కేసులో ఇరుకున్న ఆయన ఆచూకీ, కోర్టు బెయిల్ నిరాకరించిన తరువాత తెలియడం లేదని తెలిపారు. 42 సంవత్సరాల జర్నైల్ సింగ్ పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. గత నెలలో ఢిల్లీలోని ఓ అక్రమ కట్టడాన్ని కూల్చేసే క్రమంలో గొడవ జరుగగా, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో పనిచేస్తున్న జూనియర్ ఇంజనీర్ అజర్ ముస్తాఫాపై జరిగిన దాడి కేసులో జర్నైల్ పై కేసు నమోదైంది. కాగా, కేజ్రీవాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకూ పలువురు ఆప్ ప్రజా ప్రతినిధులు కేసుల్లో ఇరుక్కున్నారు.