: పాత దుస్తులైతే మాకొద్దండీ: భారతీయులకు నేపాల్ విజ్ఞప్తి
భూకంప బాధితుల సహాయార్థం పాత దుస్తులను పంపవద్దని భారతీయులకు నేపాల్ విజ్ఞప్తి చేసింది. తీవ్ర భూకంపం ధాటికి నిరాశ్రయులైన నేపాల్ వాసులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఎన్నో భారత ఎన్జీవో సంస్థలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజల నుంచి దుస్తులు, ఆహారం, మందులు తదితరాలు సేకరిస్తూ, వాటిని రైళ్లు, విమానాల్లో చేరవేస్తున్న సంగతి తెలిసిందే. వీటిల్లో కొన్ని చిరిగిన, పాత దుస్తులు ఉన్నట్టు కనుగొన్న నేపాల్ అధికారులు ఈ తరహా సాయం తమకు వద్దని అంటున్నారు. అటువంటి పాత దుస్తులు పంపవద్దని ఇండియాను కోరారు. ఇదిలావుండగా, గత ఎనిమిది రోజులుగా నేపాల్ లో సహాయం అందించిన భారత ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది రేపు తిరిగి రానున్నారు.