: తెలంగాణను కాపాడుకోవడానికి కోదండరామ్ ఆధ్వర్యంలో మరో జేఏసీ రావాలి: ఎర్రబెల్లి
కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఓ మూర్ఖుడి చేతిలో పెట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణ ద్రోహులతో నిండిపోయిందని ఆరోపించారు. తలసాని, తుమ్మల, కొండా సురేఖ, కడియం శ్రీహరి వీరంతా తెలంగాణ ద్రోహులే అని తెలిపారు. సినీ కళాకారులను తలసాని శ్రీనివాస్ యాదవ్ బెదరించారని అన్నారు. సీఎం కుటుంబసభ్యులు, టీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా, తెగబడి సంపాదిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను కాపాడుకోవడానికి కోదండరామ్ ఆధ్వర్యంలో మరో జేఏసీ రావాలని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుని... స్పీకర్ తన గౌరవాన్ని కాపాడుకోవాలని విన్నవించారు.