: ముందస్తుకే దీదీ మొగ్గు... స్థానిక ఫలితాలే కారణం!


పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలే దండిగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ పట్ల ఓటర్లలో సానుకూల దృక్పథముందని మమత గ్రహించారు. ఓటర్లలో తమ పట్ల ఉన్న సానుకూల పవనాలను క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగిన మమత, ముందస్తు ఎన్నికలకే మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు. జిల్లా పర్యటనలకు తెర తీసిన మమత, శాఖలవారీగా అభివృద్ధి నివేదికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదికలపై త్వరలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకే సీఎం మొగ్గుచూపుతున్నారని ఆ రాష్ట్ర సచివాలయ ఉన్నతాధికారితో పాటు కోల్ కతా మేయర్ గా ఎన్నికైన ఆ పార్టీ నేత సోవన్ చటర్జీ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News