: మొక్కలకు 'నితిన్ గడ్కరీ యూరిన్' ఎరువు... సామాజిక మాధ్యమాల్లో జోకులే జోకులు


తాను నిత్యమూ మూత్రాన్ని ఓ ప్లాస్టిక్ బాటిల్ లో పట్టి, ఆపై 50 లీటర్ల క్యాన్ లో నిల్వ ఉంచి తన ఇంటి తోటలోని మొక్కలకు ఎరువుగా వాడతానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించిన వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో జోకుల మీద జోకులు పేలుతున్నాయి. కరవును ఎదుర్కొనే చర్యలపై బీజేపీ ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ బంగళాలో సైతం ఇలాగే చేయాలని ఓ ఉచిత సలహా కూడా పారేశారు. కాగా, ప్రస్తుతం గడ్కరీ ఉన్న బంగళా గతంలో సోనియా అధ్యక్షతన ఏర్పడిన జాతీయ సలహా మండలి అధీనంలో ఉంది. ఆమె నివాసం 10 జన్ పథ్ కు అత్యంత సమీపంలోనే ఈ భవంతి ఉంది. యూరిన్ ఎరువుగా వేసిన మొక్కలు ఒకటిన్నర రెట్లు అధిక వేగంతో పెరుగుతాయని కూడా గడ్కరీ వ్యాఖ్యానించారు. ఈ వీడియోను బీజేపీ కార్యకర్తలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఇక అప్పటి నుంచి తెగ జోకులు వచ్చేస్తున్నాయి. "కొంపదీసి నితిన్ గడ్కరీ మా నుంచి కూడా సేకరించడం ప్రారంభిస్తారా?" అని ఒకరంటే, "ఆయన తోటలో పండే కూరగాయలు, పండ్లను వారింట్లో పనివారైనా తింటారా?" అని ఒకరు, "మరీ పచ్చి నిజాలు చెప్పినా బాగుండదు" అని ఇంకొకరు, "ఆయన బహుమతిగా పండ్లు ఇస్తే తీసుకునేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే" అని మరొకరు... ఇలా ట్వీట్ల మీద ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News