: ఏపీలో వైకాపా ఎమ్మెల్యేలకు మరో సమస్య ముంచుకొస్తోందా?


ఏపీలో టీడీపీ అధికారం చేపట్టడంతో, వైకాపా నేతలు కొందరు ఎమ్మెల్యేలు అయినప్పటికీ వారి మాట ఎక్కడా చెల్లుబాటు కాని పరిస్థితి ఇప్పటికే నెలకొంది. ఈ నేపథ్యంలో వారి స్థైర్యాన్ని దెబ్బతీసే రీతిలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్యేలకు అవసరాన్ని బట్టి రూ. 2 కోట్ల వరకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే, కేవలం టీడీపీ ఎమ్మెల్యేల వరకే ఈ నిధులను పరిమితం చేయాలని అధికారపక్షం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. అంటే, విపక్ష వైకాపా ఎమ్మెల్యేలకు నిధులు దాదాపు విడుదల కావనే చెప్పుకోవాలి. ఎమ్మెల్యేలుగా గెలుపొందినప్పటికీ సొంత నియోజకవర్గాల్లో తమ పనులేవీ జరగడం లేదని, అధికారులు మాట వినడం లేదని ఇప్పటికే మధనపడుతున్న వైకాపా ఎమ్మెల్యేలకు... నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించాలనుకుంటున్న నిధులు కూడా మంజూరుకాకపోతే... వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

  • Loading...

More Telugu News