: ఆయనొచ్చినా సీట్లో ఉండేది నరసింహే కదా?... జోకేసిన గవర్నర్


కాకినాడలోని జేఎన్ టీయూ వర్శిటీలో జరిగిన అక్రమాలపై వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన సీపీఐ నేత నారాయణ, గవర్నర్ నరసింహన్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తున్నారా? తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు పదవి ఇస్తారటగా? అంటూ నారాయణ గవర్నర్ ను అడిగారట. అందుకాయన చిరునవ్వుతో స్పందిస్తూ, 'ఇద్దరు గవర్నర్లుంటే మంచిదేగా... అప్పుడు కూడా పదవిలో ఉండేది నరసింహే కదా?' అని జోకేశారట. దీంతో అక్కడ కాసేపు నవ్వులు పూశాయి. కాగా, నరసింహన్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కొనసాగిస్తూ, తెలంగాణలో మరోకరికి బాధ్యతలు అప్పగించాలని కేంద్రం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News