: మోదీ ‘వైబో’కు ఫాలోయింగ్ వెల్లువ... ఒక్కరోజులోనే 30 వేలకు చేరిన ఫాలోయర్స్


చైనీయుల మైక్రో బ్లాగింగ్ నెట్ వర్క్ ‘వైబో.కామ్’లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాకు ఫాలోయింగ్ పోటెత్తుతోంది. నిన్న మధ్యాహ్నం సరిగ్గా 12.28 గంటలకు ఆయన వైబోలో తన ఫస్ట్ పోస్టింగ్ ను పెట్టారు. చైనా మైక్రోబ్లాగర్లకు మరింత చేరువ అయ్యేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ మోదీ చేసిన తొలి పోస్ట్ కు చైనీయుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం 3.02 గంటలకు మోదీ బుద్ధ పూర్ణిమను పురస్కరించుకని చైనీయులకు శుభాకాంక్షలు చెబుతూ మరో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కు మరింత మంది చైనీయుల మద్దతు లభించింది. గంట గంటకూ మోదీ వైబో ఫాలోయర్ల సంఖ్య పెరుగుతోంది. నేటి ఉదయానికి మోదీ వైబో ఖాతాలో 29,745 మంది ఫాలోయర్లున్నారు.

  • Loading...

More Telugu News