: వచ్చే నెల నుంచి ‘మగధీర’ విమాన సేవలు!


నిజమేనండోయ్, ‘మగధీర’ విమాన సేవలు వచ్చే నెలలోనే ప్రారంభం కానున్నాయి. హైదరాబాదు నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్ పోర్టులు ఉన్న అన్ని చిన్న పట్టణాలు, అన్ని దక్షిణాది నగరాలకు విమాన సేవలు అందించేందుకు టర్బో మేఘా ఎయిర్ వేస్ చేస్తున్న సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. టర్బో మేఘా ఎయిర్ వేస్ పేరుకు, ‘మగధీర’కు సంబంధం ఏమిటనేగా మీ అనుమానం? ఉమేశ్ వంకాయలపాటి నేతృత్వంలో కొత్తగా సేవలు ప్రారంభించనున్న ఈ కంపెనీలో టాలీవుడ్ ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ కొద్దిమేర పెట్టుబడి పెట్టాడు. అంతేకాక, ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డులో ఆయన కూడా ఓ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గానూ అతడే కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ విమానయాన సంస్థకు డీజీసీఏ అనుమతులు త్వరలో అందనున్నాయట. అనుమతులు రాగానే సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉమేశ్ చెప్పారు. కొత్తగా కొనుగోలు చేసిన రెండు ఎయిర్ క్రాఫ్ట్ లు ఈ వారంలోనే ఆ సంస్థకు అందనున్నాయి.

  • Loading...

More Telugu News