: నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఇమ్రాన్ ఖాన్ తొలి విజయం
పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న ప్రతిపక్షనేత ఇమ్రాన్ ఖాన్ తొలిసారి విజయం సాధించారు. పాక్ ప్రభుత్వంలో ప్రధాని నవాజ్ షరీఫ్ కు అత్యంత విశ్వాసపాత్రునిగా పేరున్న రైల్వే శాఖ మంత్రి ఖ్వాజా సాద్ రఫీక్ ను ఎన్నికల ట్రైబ్యునల్ అనర్హుడిగా ప్రకటించింది. 2013లో జరిగిన సాధారణ ఎన్నికల్లో లాహార్ లోని ఎన్ఏ-125 నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, రిగ్గింగ్ కు పాల్పడి విజయం సాధించినట్టు ఇమ్రాన్ ఖాన్ ట్రైబ్యునల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేసిన ట్రైబ్యునల్ ఇమ్రాన్ ఆరోపణలు నిజమని నిర్థారించింది. దీంతో ఆయన ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 60 రోజుల్లోగా రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది.