: దోపిడీ సొత్తు కుమార్తె నిశ్చితార్థానికి ఖర్చు పెట్టాడు!


దోపిడీ కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఓ వ్యక్తి విచారణలో పలు విషయాలు వెల్లడించాడు. దోపిడీ సొమ్మును కుమార్తె నిశ్చితార్థానికి ఖర్చు చేశానని తెలిపాడు. మహబూబ్ నగర్ జిల్లా గోపాల్ పేట మండలం కాశింనగర్ పోస్టుమాస్టర్ ను బెదిరించి డబ్బులు దోచుకున్న కేసులో పోలీసులు దర్యాప్తు చేయగా, ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి నుంచి ఓ తుపాకీ, రూ.87 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారే ఈ దోపిడీకి పాల్పడినట్టు తేలింది. వారిద్దరూ పోస్టుమాస్టర్ ను తుపాకీతో బెదిరించి లక్షా యాభై వేల రూపాయలు ఎత్తుకెళ్లారు.

  • Loading...

More Telugu News