: ఆవకాయ, తొక్కుడు పచ్చడి పెట్టుకున్న కేంద్ర మంత్రి!
ఆమె కేంద్ర మంత్రి అయినా ఓ తెలుగింటి కోడలు. తెలుగింట ఓ సంప్రదాయం ఉంది. పేద, ధనిక తేడా లేకుండా ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ ఆవకాయ ఊరగాయి పెట్టుకుంటారు. తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలన్న విషయం జగద్విదితమే. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం దగ్గర ఈశావాస్యంలోని అత్తవారింటికి వచ్చిన ఆమె, అత్త, ఆడపడుచులతో కలిసి ఆవకాయ, తొక్కుడు పచ్చడి పెట్టే పనిలో పడ్డారు. ఆ దృశ్యాన్ని ఫోటోతీసి, దానికి 'ఈశావాస్యంలో పునరపి ఆవకాయం! అక్క, అమ్మ సూచనలతో నిర్మల ఆవకాయ పనిలో పడింది' అంటూ క్యాప్షన్ రాసి ఆమె భర్త పరకాల ప్రభాకర్ ట్విట్టర్లో పెట్టారు.