: బెంగళూరు ముందు ఈజీ టార్గెట్... చెన్నై స్కోరు 148/9
చెపాక్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 148 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్ మిచెల్ స్టార్క్ మరోసారి ఆకట్టుకున్నాడు. స్టార్క్ 3 వికెట్లు తీయగా, వీజ్, పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. చహల్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టులో సురేశ్ రైనా (52) టాప్ స్కోరర్. ధోనీ 18 బంతుల్లో 29 పరుగులు చేశాడు.