: మాజీ ఫుట్ బాల్ ఆటగాడి పుట్టిన రోజు వేడుక ఖర్చు 3 కోట్లు


ఇంగ్లండ్ ఫుట్‌ బాల్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్ హామ్ పుట్టిన రోజు వేడుకలను వైభవంగా నిర్వహించుకున్నాడు. 40వ పడిలోకి ప్రవేశించిన బెక్ హామ్ మొరాకోలోని అమెంజనా లగ్జరీ రిసార్ట్‌ లో అరేబియా థీమ్‌ తో ఈ వేడుకను నిర్వహించుకున్నాడు. హాలీవుడ్ తారలు, ఫ్యాషన్ డిజైనర్లు, సెలబ్రిటీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అతిథుల అభిరుచిని బట్టి విందు ఏర్పాటు చేశాడు. ఈ వేడుకలకు సుమారుగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అప్పటి వరకు 'ఇన్‌స్టాగ్రామ్' ఖాతాలేని డేవిడ్ బెక్ హామ్, పుట్టినరోజు నాడే ఖాతా తెరిచి, పార్టీకి సంబంధించిన ఫొటోలను పోస్టు చేసి, ఒకే రోజు 40 లక్షల మంది అభిమానులను చేర్చుకున్నాడు. ఈ వేడుకల్లో సుమారు వంద మందికిపైగా రిసార్టు సిబ్బంది తలమునకలైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News