: దీనికి ఒప్పుకోవడం సాహసోపేత నిర్ణయం: జయప్రద


అద్భుతమైన సౌందర్యం, నటనతో సినీ ప్రేక్షకులను రంజింపజేసిన అలనాటి అందాల నటి జయప్రద మరోసారి వెండితెరపై వెలగనుంది. బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ శర్మ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమాలో జయ నటించనుంది. ఈ చిత్రంలో తన పాత్ర గ్లామరస్ గానే కాకుండా, వైవిధ్య భరితంగా కూడా ఉంటుందని తెలిపింది. గతంలో ఎన్నడూ పోషించని ఈ పాత్రను ఒప్పుకోవడం సాహసోపేత నిర్ణయమని చెప్పింది. ఈ సినిమా షూటింగ్ శ్రీలంక, నేపాల్, మలేసియాల్లో జరుగనుంది. ఈ సినిమానే కాకుండా, ఓ మళయాళ చిత్రంలోనూ నటిస్తున్నానని జయప్రద వెల్లడించింది.

  • Loading...

More Telugu News