: 'నీరజ్' నాకు ప్రత్యేకం: ఇన్ స్టా గ్రామ్ లో సోనమ్ కపూర్


తన తాజా చిత్రం 'నీరజ్' తనకెంతో ప్రత్యేకమైనదని ప్రముఖ బాలీవుడ్ కథానాయిక సోనమ్ కపూర్ తెలిపింది. రామ్ మద్వానీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నీరజ్' సినిమాలో సోనమ్ కపూర్ ఎయిర్ హోస్టెస్ గా అభిమానులను అలరించనుంది. 'నీరజ్' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోను తన ఇన్ స్టా గ్రాం పేజ్ లో సోనమ్ కపూర్ పోస్టు చేసింది. సోనమ్ కపూర్ 2007లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అనీల్ కపూర్ కుమార్తెగా, ఫ్యాషన్ ఐకన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సోనమ్, సినీ నటిగా అనుకున్నంత బ్రేకప్ సాధించలేకపోయింది. ఆమెతో పాటు సినీ రంగ ప్రవేశం చేసిన రణ్ బీర్ కపూర్ బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోగా హోదా సంపాదించుకున్నవిషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News