: ఇది ప్రత్యర్థులు, మీడియా చేస్తున్న దుష్ప్రచారం... నాకు ఆప్ సభ్యురాలితో అఫైర్ లేదు: కుమార్ విశ్వాస్
ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యురాలితో 'సంబంధం' ఉన్నట్టు ఆరోపణలు రావడంపై ఆ పార్టీ నేత కుమార్ విశ్వాస్ స్పందించారు. తనకు ఏ సభ్యురాలితోనూ అఫైర్ లేదని స్పష్టం చేశారు. ఆ ఆరోపణలన్నీ నిరాధారమని కొట్టిపారేశారు. ఇది ప్రత్యర్థులు, మీడియా చేస్తున్న ప్రచారం అని ఆరోపించారు. తనకు మహిళా కమిషన్ నుంచి సమన్లేవీ అందలేదని అన్నారు. ఆప్ వలంటీర్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆమెపై వేధింపులకు సంబంధించినదని తెలిపారు. నలుగురు వ్యక్తులను పేర్లను ఆమె తన ఫిర్యాదులో పేర్కొందని విశ్వాస్ వివరించారు. ఈ వ్యవహారంలో పరువునష్టం ఫిర్యాదు దాఖలు చేసినట్టు తెలిపారు.