: "మీకు మేం కనిపించడం లేదా ?": నేపాల్ లో 'పవతోక్' వాసుల ఆక్రోశం


నేపాల్ ను భూకంపం అతలాకుతలం చేసి ఇప్పటికి వారం రోజులు దాటింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి వెలికితీస్తున్న మృతదేహాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కాగా, భూకంపం సంభవించినప్పటి నుంచి తమను పట్టించుకున్న నాథుడే లేడని ఖాట్మండూ సమీపంలోని పవతోక్ గ్రామ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యల కోసం ఎవరూ తమ గ్రామం రాలేదని వారు చెబుతున్నారు. సహాయ సామగ్రితో కూడిన ట్రక్కులు గ్రామం మీదుగా వెళుతుండగా, స్థానికులు వాటిని వెంబడించారు. అక్కడ ఆపి తమకు సాయం చేయాల్సిందిగా కోరినా, సాయుధ పోలీసు రక్షణతో వెళుతున్న ఆ కాన్వాయ్ ఆగలేదు. దీంతో, పవతోక్ గ్రామవాసులు "మీకు మేం కనిపించడం లేదా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వీ నీడ్ హెల్ప్. ప్లీజ్ హెల్ప్' అంటూ గ్రామం మొదట్లో బోర్డును పెట్టారు. తమ గ్రామానికి ప్రభుత్వ అధికారులు, సైనికులు ఎవరూ రాలేదని వారు వాపోయారు.

  • Loading...

More Telugu News