: శివాజీ దీక్షకు జనసేన దన్ను... పెరుగుతున్న పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు


ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేపట్టిన టాలీవుడ్ నటుడు, బీజేపీ నేత శివాజీకి మద్దతు పెరుగుతోంది. నిన్న గుంటూరులో శివాజీ చేపట్టిన దీక్షకు మాల మహానాడు, ఆమ్ ఆద్మీ పార్టీ, కొన్ని ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. తాజాగా నేటి ఉదయం విశాలాంద్ర మహాసభ, దళిత క్రిస్టియన్ ఫెడరేషన్ కూడా తమ మద్దతు ప్రకటించాయి. మరోవైపు టాలీవుడ్ ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన కార్యకర్తల మద్దతు కూడా శివాజీ దీక్షకు లభించింది. జనసేన కార్యకర్తలు దీక్షా స్థలి వద్దకు వచ్చి శివాజీ దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

  • Loading...

More Telugu News