: ఏపీలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయి: గర్నవర్ కు వైఎస్ జగన్ ఫిర్యాదు
ఏపీలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్యను ఆయన ప్రస్తావించారు. వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు సర్కారు యత్నిస్తోందని ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న అధికారపక్షాన్ని నిలువరించాలని ఆయన గవర్నర్ ను కోరారు.