: అంతా నాశనం చేసేశారు...: తమిళనాడు ముఖ్యమంత్రికి స్టాలిన్ ఘాటు లేఖ


తమిళనాడు డమ్మీ (జయ కీలుబొమ్మ) ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు డీఎంకే కీలక నేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఘాటు లేఖ రాశారు. తమ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులంతా దోపిడీ దొంగలుగా మారారని ఆరోపించారు. మంత్రుల వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురవుతున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజల కోసం ప్రార్థనలు చేయాల్సిన తమరు... అవినీతి కేసులో శిక్ష పడ్డ జయ కోసం ప్రార్థనలు చేస్తున్నారని పన్నీర్ పై మండిపడ్డారు. గతంలో తమిళనాడుకు పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వచ్చేవని... ఏఐఏడీఎంకే హయాంలో కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోవడమే కాకుండా, ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విమర్శించారు. ప్రస్తుతం తమిళనాడు ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News