: అనంతలో కొనసాగుతున్న బంద్... భారీగా మోహరించిన బలగాలు
రాప్తాడు వైకాపా కన్వీనర్ ప్రసాద్ రెడ్డి హత్య నేపథ్యంలో జరిగిన ఆందోళనలకు సంబంధించి ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో, అనంతపురం పట్టణ బంద్ కు వైకాపా పిలుపునిచ్చింది. బంద్ ను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా... భారీ ఎత్తున భద్రతా బలగాలను తరలించారు. ప్రస్తుతం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.