: వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అవినీతి తిమింగిలం...లక్షన్నర తీసుకుంటూ పట్టుబడ్డ డీసీటీఓ
ఏపీలో మరో అవినీతి తిమింగలానికి యాంటీ కరప్షన్ బ్యూరో బేడీలు వేసింది. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ లో రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ డీసీటీఓ కమలాకర్, ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. డీసీటీఓ వేధింపులతో విసిగిపోయిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అతడిని పట్టుకునేందుకు పక్కాగా పథక రచన చేశారు. బాధితుడి నుంచి రూ.1.5 లక్షల నగదును అందుకుంటున్న కమలాకర్ ను పట్టుకుని అరెస్ట్ చేశారు.