: నీకంత సీను లేదు... ఫైల్స్ అన్నీ నా టేబుల్ పైకి రావాల్సిందే: కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఢిల్లీ గవర్నర్ ఆదేశం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చీవాట్లు పెట్టారు. చట్టాలను గౌరవించాలని, అన్ని నియమ నిబంధనలు పాటించాల్సిందేనని, భారత రాజ్యాంగం ప్రకారం ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఫైళ్లు తన కార్యాలయానికి వచ్చి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. 1991 నాటి 'ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ' (జీఎన్సీటీడీ) చట్టం ప్రకారం మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలు, ఆమోదించే చట్టాలు తనకు తెలియాల్సిందేనని ఆయన తెలిపారు. కాగా, పరిపాలనకు చెందిన ఫైల్స్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి పంపించాల్సిన అవసరం లేదని కేజ్రీ, అన్ని శాఖల అధికారులకూ చెప్పిన నేపథ్యంలో నజీబ్ జంగ్, కేజ్రీవాల్ సహా అందరు మంత్రులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నజీబ్ జంగ్ బీజేపీ ఏజెంట్ లా పనిచేస్తున్నారని కేజ్రీవాల్ ఆయనను విమర్శించిన సంగతి తెలిసిందే.