: బస్సును ఢీ కొట్టిన ఇసుక లారీ... 15 మంది చిన్నారులు సహా 30 మందికి గాయాలు
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ లారీ కొద్దిసేపటి క్రితం బీభత్సం సృష్టించింది. హైదరాబాదు శివారు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఎదురుగా వస్తున్న ఓ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 15 మంది చిన్నారులు సహా 30 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.