: బెజవాడ మెట్రో రైలుకు గ్రీన్ సిగ్నల్... మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధాని సమీపంలోని విజయవాడ నగరంలో కొత్తగా ఏర్పాటు కానున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు నేడు ఏపీ సర్కారు పచ్చజెండా ఊపనుంది. ఈ మేరకు మరికాసేపట్లో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో భేటీ కానున్న ఆ రాష్ట్ర కేబినెట్ ప్రాజెక్టుకు తుది అనుమతి ఇవ్వనుంది. రాష్ట్రంలో ఇసుక వేలం, నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన, హైకోర్టు ఏర్పాటుపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తీర్పు తదితరాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం.