: సొంతగడ్డపై 'కింగ్స్' భంగపాటు
సొంతగడ్డ మొహాలీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో పంజాబ్ 7 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. మిల్లర్ 43, విజయ్ 39, బెయిలీ 21 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో మలింగ 2 వికెట్లు తీశాడు. హర్భజన్, సుచిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 'కింగ్స్' ఇన్నింగ్స్ లో ముగ్గురు రనౌటయ్యారు.