: నేపాల్ భూకంప బాధితులకు సాయం చేయట్లేదు: సల్మాన్
నేపాల్ లో భూకంప బాధితులకు తన స్వచ్ఛంద సేవా సంస్థ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సాయం చేస్తుందని మీడియాలో వచ్చిన వార్తలపై బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించారు. తన సంస్థ తరపున నేపాల్ భూకంప బాధితులకు ఎలాంటి ఆర్థికసాయం అందించడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ భారత్ లోనే కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. తమ ఎన్జీవోపై వచ్చిన వార్తల్లో నిజం లేదు అని పేర్కొన్నారు.