: ఫేస్ బుక్ సీఓఓ భర్త హఠాన్మరణం
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) షెరిల్ శాండ్ బర్గ్ భర్త డేవిడ్ గోల్డ్ బర్గ్ (47) హఠాన్మరణం చెందారు. శుక్రవారం రాత్రి డేవిడ్ గోల్డ్ బర్గ్ మరణించినట్టు అతని సోదరుడు రాబర్ట్ గోల్డ్ బర్గ్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. డేవిడ్ కాలిఫోర్నియాలోని ప్రముఖ ఆన్ లైన్ సర్వే సంస్థ 'సర్వేమంకీ'కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదని అమెరికా మీడియా పేర్కొంది. దీనిపై ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ స్పందించారు. డేవిడ్ గోల్డ్ బర్గ్ అద్భుతమైన వ్యక్తి అని కీర్తించారు. షెరిల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.