: నేపాల్ లో శిథిలాల నుంచి సజీవంగా బయటపడిన 105 ఏళ్ల వృద్ధుడు
నేపాల్ ను అతలాకుతలం చేసిన భూకంపం ఇప్పుడక్కడ శిథిలాలను మిగిల్చింది. కుటుంబాలకు కుటుంబాలనే తుడిచిపెట్టిన ఈ భూకంపం, అక్కడి చారిత్రక కట్టడాలను నేలమట్టం చేసింది. కాగా, సహాయక బృందాలు ఓ 105 ఏళ్ల వృద్ధుడిని శిథిలాల నుంచి బయటికి తీశాయి. భూకంపం సంభవించి వారం పైబడుతున్నా, ఈ శతాధిక వృద్ధుడు ఇంకా సజీవుడిగా ఉండడం విశేషం. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నేపాల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలు దేశాలకు చెందిన బృందాలు, నేపాల్ అధికార వర్గాలు ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.