: వీఐపీ ఎస్కార్ట్ వాహనంలో డీజిల్ దొంగిలిస్తూ పట్టుబడిన పోలీసు


ఇటీవల బీహార్ లోని వీఐపీల కోసం కొత్త వాహనాలు కొనుగోలు చేశారు. ప్రముఖుల కాన్వాయ్ లో భాగంగా పోలీసుల ఎస్కార్ట్ వెహికిల్స్ కూడా ఉంటాయి. అలాంటి ఓ ఎస్కార్ట్ వాహనం నుంచి డీజిల్ దొంగిలిస్తూ సాక్షాత్తూ పోలీసు కానిస్టేబుల్ పట్టుబడడంతో అందరూ నివ్వెరపోయారు. పాట్నాలోని గాంధీ మైదాన్ వద్ద జీపు నిలిపి ఉంచిన సమయంలో డీజిల్ చౌర్యానికి పాల్పడినట్టు ఆ పోలీసు అంగీకరించాడు. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో పోలీసు శాఖలోని మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఎక్కడైనా నేరం జరిగినప్పుడు ఇంధన కొరత కారణంగా వెళ్లలేకపోతున్నామని, అందుకే, డీజిల్ చౌర్యానికి పాల్పడినట్టు పోలీసు తెలపడం గమనార్హం.

  • Loading...

More Telugu News