: నా జోలికి ఒక్కరు వస్తే, నేను వందమంది జోలికి వస్తా: నటుడు శివాజీ


తాను అన్నింటికీ తెగించి ఉద్యమం చేస్తున్నానని నటుడు శివాజీ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో ఆమరణ దీక్ష చేపట్టిన ఆయన, ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తనను ఎవరో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, తన జోలికి రావాలంటే, అన్నిటికీ సిద్ధపడి రావాలని సవాల్ విసిరారు. తెలుగుజాతి కోసం, పిల్లల భవిత కోసం తాను ఉద్యమం చేస్తున్నానని, దేనికైనా తాను సిద్ధమేననని ఉద్ఘాటించారు. తన జోలికి ఒక్కరు వస్తే, తాను వందమంది జోలికి వెళతానని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిరావాలన్నారు.

  • Loading...

More Telugu News