: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై... ఓపెనర్ల వీరవిహారం


ఐపీఎల్ లో ఈ సాయంత్రం ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. చండీగఢ్ లోని మొహాలీ స్టేడియం ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ముంబై ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్, పార్థివ్ పటేల్ బ్యాట్లు ఝుళిపిస్తుండడంతో పరుగులు వెల్లువెత్తాయి. దీంతో, 10 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 96 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ 48, సిమ్మన్స్ 46 పరుగులతో ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News