: ముంబై 'గుండె' చాలా బలహీనం!
దేశంలోని మెట్రో నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు వేగంగా పడిపోతున్నాయి. భారత్ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబైలో రోజుకు సగటున 80 మంది గుండెపోటు కారణంగా ప్రాణాలు విడుస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 29,393 మరణాలు హార్ట్ అటాక్ కారణంగా సంభవించాయట. నగరంలో గత 15 ఏళ్లుగా గుండెపోటు కారణంగానే అత్యధికంగా మరణాలు చోటుచేసుకుంటున్నాయని, తర్వాతి స్థానంలో టీబీ (క్షయ) ఉందని చేతన్ కొఠారి అనే సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు తెలిపారు. ఈ రెండింటి తర్వాత క్యాన్సర్ అత్యధికులను బలితీసుకుంటోందట. ముంబయి వాసులు జీవనశైలి కారణంగా హృద్రోగాల బారినపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. సరైన ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం, మారుతున్న జీవన విధానం ప్రజలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతున్నాయని వివరించారు.