: థాయ్ లాండ్ లో చేపల వాన!
అవును నిజమే. థాయ్ లాండ్ లో చేపల వర్షం కురిసింది. ఈ తరహా ఘటనలు అరుదుగా జరుగుతుంటాయని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. ఇటువంటి వర్షం ఎలా పడుతుందో కూడా వివరించారు. సముద్రాలపై టోర్నడోలు ఏర్పడి, వేగంగా సుడులు తిరుగుతూ, ప్రయాణించేటప్పుడు చేపలు తదితర సముద్ర జంతువులను అమితమైన శక్తితో పైకి లాగుతాయి. ఒక్కోసారి టోర్నడోలతో పాటు గాల్లో వందల కిలోమీటర్ల దూరాన్ని ఈ జీవులు ప్రయాణిస్తుంటాయి. ఒకసారి టోర్నడో బలహీనపడిన తరువాత ఈ జీవులు వర్షంలా నేలపై పడతాయి. అదన్నమాట, ఈ చేపల వర్షం వెనకున్న అసలు విషయం. కాగా, గతంలోనూ థాయ్ లో చేపల వర్షం కురిసింది.