: మళ్లీ వచ్చిన మాయదారి మేఘాలు... భారీ వర్షాలు కురిసే అవకాశం


తెలుగు రాష్ట్రాలపై క్యుములో నింబస్ మేఘాలు మరోసారి ప్రతాపం చూపనున్నాయి. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో సాయంత్రానికి క్యుములో నింబస్ మేఘాలు భూమికి తక్కువ ఎత్తులో ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కొన్ని చోట్ల వడగళ్లతో కూడిన వానలతో పాటు, పిడుగులు పడతాయని పేర్కొంది. రైతులు ఆరు బయట ఉన్న తమ పంటను జాగ్రత్త చేసుకోవాలని సలహా ఇచ్చింది.

  • Loading...

More Telugu News