: యూఎస్ లో భారత మహిళపై కాల్పులు


భారత సంతతికి చెందిన గుజరాత్ మహిళపై అమెరికాలో దాడి జరిగింది. ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ నిర్వహిస్తూ, అందులో క్లర్క్ గా పనిచేస్తున్న మ్రదులాబెన్ పటేల్ అనే మహిళపై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నారని తెలిసింది. కాల్పులు జరిపిన వ్యక్తి ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడో తెలియదని అధికారులు వివరించారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన వివరాల ప్రకారం, అనుమానాస్పదంగా వచ్చిన ఓ వ్యక్తి తొలుత సిగరెట్స్ ఇవ్వమని కోరాడని, ఆ వెంటనే కాల్పులు జరిపాడని తెలిసినట్టు వివరించారు. ఆపై ఎటువంటి దొంగతనానికి పాల్పడకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో, ఉద్దేశపూర్వకంగానే అతడు కాల్పులు జరిపి ఉండవచ్చని అనుమానిస్తున్నట్టు తెలియజేశారు.

  • Loading...

More Telugu News