: సెలవు వివాదంలో సీనియర్ ను కాల్చి, ఆత్మహత్య చేసుకున్న పోలీసు అధికారి


ఓ సెలవు వివాదం ఇద్దరు పోలీసు అధికారుల ప్రాణాలు తీసింది. ఈ ఘటన ముంబయిలోని వాకోలాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న దిలీప్ షిర్కే ఇటీవల ఓ సెలవు తీసుకున్నాడు. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించగా, దిలీప్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. విచారణ పేరిట సీనియర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ విలాస్ జోషి తన గదిలోకి దిలీప్ ను పిలిపించగా, ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరిగాయి. అనంతరం కాల్పుల శబ్దం వినిపించింది. పోలీసులు వెళ్లి చూస్తే, సీనియర్ అధికారిపై కాల్పులు జరిపిన దిలీప్ తనను తాను కాల్చుకున్నాడు. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే దిలీప్ చనిపోయాడని డాక్టర్లు వివరించారు. తీవ్రగాయాలపాలైన జోషి అర్ధరాత్రి మరణించాడు. క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News