: మరికాసేపట్లో ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టనున్న నటుడు శివాజీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తక్షణం ప్రకటించాలని కోరుతూ నటుడు శివాజీ నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షా వేదికను ఇప్పటికే సిద్ధం చేయగా, మరికాసేపట్లో ఆయన దీక్షను మొదలుపెట్టనున్నారని సమాచారం. శివాజీ చేపట్టిన దీక్షకు ఇప్పటికే మాల మహానాడు మద్దతు తెలిపింది. మాల మహానాడు నేత కారెం శివాజీ తన కార్యకర్తలతో దగ్గరుండి వేదిక వద్ద ఏర్పాట్లు పర్యవేక్షించారు. శివాజీ దీక్షకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు వస్తుండడం వల్ల తెలుగుదేశం, బీజేపీ పార్టీల్లో అలజడి కనిపిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News