: కుర్ కురే కంపెనీలో అగ్నిప్రమాదం
ప్రముఖ తినుబండారాల బ్రాండ్ కుర్ కురే తయారు చేసే ఫ్యాక్టరీలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ పరిధిలోని కాటేదాన్ లో కుర్ కురే తయారు చేసి ప్యాకింగ్ ఫ్యాక్టరీలో మంటలంటుకున్నాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన వెనుక గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.